భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బిఐ) తన సామాజిక బాధ్యతలో(సీఎస్సార్) భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి 25 సిమెంటు బెంచీలను మంగళవారం అందించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల వేదికకు జిల్లా వ్యాప్తంగా వందలాది మంది తమ సమస్యలను జిల్లా అధికారులకు విన్నవించేందుకు వస్తారు. జిల్లా పాలనా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసినా కుర్చీలు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు.