కాకినాడలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 10 మందిని పట్టుకున్నామని ట్రాఫిక్ సీఐ నూని రమేశ్ తెలిపారు. వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరుచగా, వారిలో ఒకరికి ఐదు రోజులు, ఇద్దరికి రెండు రోజులు జైలు శిక్ష విధించగా, మిగిలిన ఏడుగురికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటివారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.