కాకినాడ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న సీహెచ్ కృష్ణయ్యను అనారోగ్యం కారణంగా విధులు నిర్వహించలేకపోతున్నారని బలవంతంగా అధికారులు ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ చేయించడం జరిగిందని కుటుంబ సభ్యులు సీహెచ్ దేవానంద్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యం ఉన్న తండ్రి కృష్ణయ్య చేత ఆర్టీసీ అధికారులు రాజీనామా చేయించడం జరిగిందన్నారు.