కాకినాడ: సీపీఎం మాజీ కార్పొరేటర్ గోళ్ళమూడి మృతి

ఉపాధ్యాయ ఉద్యమ నేతగా కాకినాడ నగరపాలక సంస్థ మాజీ కార్పొరేటర్ కామ్రేడ్ గోళ్ళమూడి నాగేశ్వరరావు (84) సోమవారం కాకినాడ 49వ డివిజన్ నేతాజీ వీధిలో వారి స్వగృహం వద్ద మరణించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు జిల్లా కమిటీ సభ్యులు దువ్వ శేషబాబ్జీ, జి బేబిరాణి, మోర్త రాజశేఖర్, సీపీఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, తదితరులు నాగేశ్వరరావు భౌతిక కాయం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్