కాకినాడ రంగరాయ వైద్య కళాశాల పారామెడికల్ విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురు ల్యాబ్ సిబ్బందిని ఉద్యోగాల నుండి తొలగింపుకు ప్రభుత్వానికి సూచిస్తున్నామని రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ డా. రాయపాటి శైలజ తెలిపారు. సోమవారం కాకినాడ జీజీహెచ్ లో ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆర్ఎంసి పారామెడికల్ విద్యార్థినులపై జరిగిన దురాగతాల పట్ల ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసారు.