విశాఖ నగరంలో దొంగతనాలు చేసి హైదరాబాద్‌లో జల్సాలు చేస్తున్న కాకినాడకు చెందిన మహేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 35 లక్షల నగదు, 2 కేజీల బంగారం, 8 కేజీల వెండి చోరీ కేసులో ఈ అరెస్టు జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో ఇతనిపై 30 నుంచి 40 వరకు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.