విశ్రాంత రెవెన్యూ ఉద్యోగి కాకర్లపూడి కేశవవర్మ అరుణాచలంలో ఇప్పటివరకు 116 గిరి ప్రదక్షిణలు పూర్తి చేశారు. 2021లో కాకినాడ కలెక్టరేట్‌లో డిప్యూటీ తహసీల్దార్‌గా పదవీ విరమణ చేసిన ఆయన మంచి చిత్రకారుడు, రంగస్థల నటుడు కూడా. గురువు సలాది గంగరాజు బహుమతిగా ఇచ్చిన భగవద్గీత చదవడం ప్రారంభించిన తర్వాత భక్తిమార్గంలోకి అడుగుపెట్టి 2023లో అరుణాచలానికి వెళ్లి గిరిప్రదక్షిణలు మొదలుపెట్టారు.