కాకినాడ: శాకంబరీగా కనకదుర్గ దేవి అమ్మవారు దర్శనం

కాకినాడ జగన్నాధపురం చిన్న మార్కెట్ వద్ద గల శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఆషాడ మాసం బహుళ శుద్ధి సందర్భంగా అమ్మవారుశాకాంబరిగా భక్తులకు దర్శించారు. ఆలయ అర్చకులు శంకర్ మాట్లాడుతూ వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని శాకంబరిగా అలంకరించడం జరిగిందన్నారు. 36 సంవత్సరాలుగా ఆషాడ మాసంలో అమ్మవారిని శాకంబరీగా అవతరించడం జరుగుతుందన్నారు. దాతల సహకారంతో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశామన్నారు.

సంబంధిత పోస్ట్