ఆధునిక పద్ధతిలో గైనకాలజీ శస్త్ర చికిత్సలు ప్రత్యక్ష ప్రచారం ద్వారా చేయడం జరిగిందని కాకినాడ నగర గైనకాలజీ అసోసియేషన్ వర్క్ షాప్ చైర్మన్ డాక్టర్ కొండమూరి సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ జి జిహెచ్ నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చేస్తున్న శస్త్ర చికిత్సలను ఫ్యాబ్రిక్ ఫంక్షన్ హాల్ లో యువ వైద్యులు వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మూడు రోజులు పాటు వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.