కాకినాడ సెజ్ ప్రాంతంలో పరిశ్రమల జాడ కనిపించడం లేదని పరిశ్రమలు వస్తే తమకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూస్తున్న యువత ఆశలపై ప్రభుత్వాలు ఏళ్ల తరబడి నీళ్లు చల్లుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు. ఆదివారం మధ్యాహ్నం కాకినాడ పొన్నంమండ రామచంద్ర రావు భవన్ లో సీపీఐ కాకినాడ నగర 23 వ మహాసభ పప్పు ఆదినారాయణ అధ్యక్షతన జరిగింది.