కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో మే 7వ తేదీ గురువారం 200 ఉద్యోగాల కోసం భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. లలిత ఇండస్ట్రీస్, భారత్ ఫైనాన్స్, ఎస్బీఐ గ్రూపుల్లో ఈ ఖాళీలు ఉన్నాయని అధికారి జి. శ్రీనివాసరావు తెలిపారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివి, 18-35 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులు అర్హులు. ఆసక్తి ఉన్నవారు ధ్రువపత్రాలతో ఉదయం 10 గంటలకు కార్యాలయానికి హాజరుకావాలని సూచించారు.