నవజాత శిశువులు, చిన్న పిల్లలు వైద్య సదుపాయాలలో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ముందంజలో ఉందని, జిజిహెచ్ పరిపాలనాధికారిణి డా. లావణ్య కుమారి పేర్కొన్నారు. కాకినాడ లో పీడియాట్రిక్స్ లెక్చర్ గేలరీ లో చైల్డ్ హెల్త్ డవలెప్మెంట్ గ్రూప్ సహకారంతో ఎస్బీఐ ఫౌండేషన్ ద్వారాఎన్ఐసియు పరికరాలను సూపరింటెంట్ డా. లావణ్య కుమారి, రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. విష్ణువర్ధన్ చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు.