కూటమి పాలనలో పేదల బతుకుల్లో వెలుగులు విరుజిల్లుతున్నాయని, వైసీపీ నాయకులు ఎన్ని కుతంత్రాలు వేసినా అభివృద్ధిని ఆపలేరని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం కాకినాడలో 5,22 డివిజన్ నందు ఇంటింటా ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ప్రజల అభిప్రాయాలను మై టీడీపీ యాప్ లో పొందుపరిచారు.