పవిత్ర క్షేత్ర దర్శనాలే లక్ష్యంగా ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టామని ఇండియన్ రైల్వేస్ సౌత్ స్టార్ రైల్ & టూర్ టైమ్స్ డైరెక్టర్ విఘ్నేష్ జీ తెలిపారు. గురువారం కాకినాడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మహాలయ పక్ష ప్రత్యేక సప్త మోక్ష క్షేత్ర యాత్ర' సెప్టెంబర్ 9వ తేదీన ప్రారంభం అవుతుందన్నారు. గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు మీదుగా సాగుతుందని తెలిపారు.