భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం సంక్షేమ హాస్టల్లో బస (నిద్ర) కార్యక్రమాన్ని ఎస్ఎఫ్ఐ నాయకులు కాకినాడలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం. గంగా సూరిబాబు, సంక్షేమ హాస్టల్ జిల్లా బాధ్యులు సిద్దు సంయుక్తంగా మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టల్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు.