కాకినాడలో సూర్యనారాయణపురం 28వ డివిజన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ శుక్రవారం జోరుగా సాగింది. మాజీ మేయర్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుంకర పావని తిరుమల కుమార్ ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పాలన సాగుతుందన్నారు. కొత్త పింఛన్లు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. తెల్లవారుజాము నుంచి పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.