కాకినాడ: ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ

ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛను మొత్తాన్ని లబ్ధిదారులకు ఒకరోజు ముందే, అంటే జనవరి 31వ తేదీన పంపిణీ చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 1న ఆదివారం సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో 2,69,762 మంది లబ్ధిదారులకు రూ.117 కోట్ల నిధులు విడుదల చేశారు. ఇందులో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, ఆరోగ్య సమస్యలున్నవారు, డప్పు కళాకారులు, సీకేడీయూ, ట్రాన్స్‌జెండర్, ఆర్టిస్ట్స్, సైనిక వెల్ఫేర్ విభాగం వారికి పింఛన్లు అందనున్నాయి. కాకినాడ డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు పింఛన్ల జాబితాను ప్రకటించారు.

సంబంధిత పోస్ట్