కాకినాడ జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో అర్జీదారులు పోటెత్తారు. కాకినాడ జిల్లా నుంచి వివిధ సమస్యలపై జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, విఆర్ఓ వెంకట్రావు తదితర అధికారులకు అర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.