ప్రేమ వివాహం చేసుకున్న తమకు.. తమ పెద్దల నుంచి ప్రాణ హాని ఉందని ఓ జంట గురువారం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ను ఆశ్రయించారు. కాకినాడ జిల్లా సర్పవరం గ్రామానికి చెందిన రమ్య, నవర గ్రామానికి చెందిన సాయిగణేష్‌లు ఇద్దరు ప్రేమించుకున్నారని, ఇటీవల అన్నవరంలో వివాహం చేసుకున్నారని తెలిపారు. వారి వివాహానికి యువతి తల్లిదండ్రులు అడ్డు చెప్పడంతో సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు.