రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన 13వ ప్రజా దర్బార్‌కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను విన్నవించారు. వాటిలో చాలా సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించగా, మిగతావి న్యాయబద్ధంగా పరిష్కరించేందుకు సిఫారసు చేసినట్టు ఎంపీ కార్యాలయం తెలిపింది.