ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలోకి కూటమి ప్రభుత్వం తీసుకువెళ్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు వనమాడి కొండబాబు నియోజకవర్గ పరిశీలకులు దేశంశెట్టి లక్ష్మీనారాయణతో కలిసి సోమవారం కాకినాడలో 12,41 డివిజన్లలో పర్యటించి, ప్రతి ఇంటికి తిరిగి కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు.