కాకినాడ రంగారాయ మెడికల్ కాలేజీలో పారా మెడికల్ విద్యార్థినులపై లైంగిక వేదింపులకు పాల్పడిన నలుగురు కీచకులను వెంటనే సస్పెండ్ చేసి, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. సిద్ధూ, పీవైఎల్ రాష్ట్ర నాయకుడు వి. భీమ శంకర్ డిమాండ్ చేశారు. కాకినాడలో విలేకరుల సమావేశంలో శనివారం వారు మాట్లాడారు. వారిపై కఠినమైన చట్టాలు పెట్టాలని పేర్కొన్నారు.