సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వనమాడి

వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో, కాకినాడ సిటీ నియోజకవర్గ పరిధిలోని 28 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ (CM Relief Fund) కింద మంజూరైన రూ. 28.52 లక్షల విలువైన చెక్కులను ఆయన అందజేశారు. ఈ నిధి ద్వారా పేదల వైద్య ఖర్చులకు ఆర్థిక భరోసా లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్