కాకినాడ జిల్లాలోని పాఠశాలల్లో సాంకేతిక విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నూతన ట్యాబ్స్‌ను మంజూరు చేసింది. గతంలో 'పాల్ ల్యాబ్స్'లో ఉన్న ట్యాబ్స్ పని చేయకపోవడంతో, వాటి స్థానంలో 630 కొత్త ట్యాబ్స్ మంగళవారం జిల్లాకు చేరుకున్నాయి. 21 ల్యాబ్స్‌కు వీటిని పంపిణీ చేయనున్నట్లు డీఎన్ఓ పి.రాంబాబు తెలిపారు. డీఈవో, ఏపీసీ ఆదేశాల మేరకు వీటిని పాఠశాలలకు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.