కాకినాడలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్‌బాబు కార్యాలయంలో 55వ వారపు ప్రజాదర్బార్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తోందని కార్యాలయ ఇన్‌చార్జి మేకా లక్ష్మణమూర్తి, మాజీ జెడ్పీటీసీ, టీడీపీ సీనియర్ నాయకుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూటన్ఆనంద్, గింజాల శ్రీనివాసరావు, జున్నూరు బాబ్జి తదితరులు పాల్గొన్నారు.