సామర్లకోట: తప్పిపోయిన చిన్నారిని అప్పగించిన పోలీసులు

సామర్లకోట రైల్వే స్టేషన్లో గురువారం తప్పిపోయిన ఓ చిన్నారిని పోలీసులు కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించారు. భీమవరం నుంచి దువ్వాడకు కూలీ పనుల కోసం వెళ్తున్న కుటుంబానికి చెందిన చిన్నారి రైల్వే స్టేషన్లో తప్పిపోయింది. ట్రాఫిక్ ఎస్ఐ అడపా గరగారావుకు సమాచారం ఇవ్వగా, ఆయన సీసీ కెమెరాల సహాయంతో చిన్నారిని గుర్తించి కుటుంబ సభ్యులకు అందజేశారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ట్రాఫిక్ ఎస్ఐను అభినందించారు.

సంబంధిత పోస్ట్