కాకినాడ జిల్లాలో జల జీవన్ మిషన్ పనులను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ హరేంధర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తాగునీటి సరఫరా పర్యవేక్షణ కోసం ప్రతినెలా గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ఆయన తెలిపారు.