మే 21 నుంచి జూన్ 4 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో, జిల్లా వ్యాప్తంగా 40 పరీక్షా కేంద్రాల్లో 24,072 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని కలెక్టర్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.