కాకినాడ అన్నమ్మ ఘాటీ సెంటర్‌లో ఆకస్మిక తనిఖీ

కాకినాడ నగరంలోని అన్న క్యాంటీన్లలో పరిశుభ్రత, ఆహార నాణ్యతపై కమిషనర్ సత్యనారాయణ ప్రత్యేక దృష్టి సారించారు. శుక్రవారం అన్నమ్మ ఘాటీ సెంటర్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, వడ్డించే భోజనాన్ని స్వయంగా పరిశీలించారు. పేదలకు పౌష్టికమైన, నాణ్యమైన ఆహారం అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని ప్రజలకు మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దాలని ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్