స్థానిక కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ 'ఆల్ డిజి' టెక్ క్యాంపస్ ఇంటర్వ్యూలను నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలలో తమ కళాశాల విద్యార్థులు 125 మంది ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ యన్వి. వేణుగోపాల్ గురువారం తెలిపారు. క్యాంపస్ ఇంటర్వ్యూలకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నందున విద్యార్థులు అన్ని ఇంటర్వ్యూలలో ఎంపిక కాగలుగుతున్నారని ఆయన పేర్కొన్నారు.