గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో స్టేట్ ఫస్ట్ సాధించిన సంపర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఈ విద్యా సంవత్సరం కూడా అదే ఉత్సాహంతో విద్యార్థులకు వినూత్నంగా ఆహ్వానం పలికింది. గత ఏడాది సాధించిన ఘన విజయం స్ఫూర్తితో ఈ ఏడాది కూడా మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు కొత్త ఉత్సాహంతో తరగతులను ప్రారంభించారు.