గురువారం ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో బొడ్డు చిన్న వెంకటాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. కర్రి నేహ శ్రీ 600 మార్కులకు 562 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, చెక్కా త్రిగుణ, మల్లాడి జయశ్రీ ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించారు. పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.