తాళ్లరేవు మండలంలోని కోరంగి మడ అడవులను జిల్లా అటవీ అధికారి రామచంద్రరావు శుక్రవారం పరిశీలించారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలు, పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాల వివరాలను రేంజ్ అటవీ అధికారి వర ప్రసాద్ ఆయనకు వివరించారు. ఇటీవల తుఫాన్ ప్రభావం తర్వాత అడవి పరిసరాల పరిస్థితిని ప్రత్యక్షంగా అంచనా వేయడానికి DFO ఈ సందర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా, పర్యాటకులు మళ్లీ అడవికి రావడం ప్రారంభించారని అధికారులు తెలియజేశారు.