కాకినాడ జిల్లాలో గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ ఇంజక్షన్లు

కాకినాడ జిల్లా వ్యాప్తంగా 14 ఏళ్లు నిండిన బాలికలకు హెచ్పీవీ (HPV) ఇంజక్షన్లు అందిస్తున్నట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కె.వి సుబ్బరాజు తెలిపారు. గురువారం పెదపూడి మండలం పెద్దాడ PHC ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ప్రతి ఒక్కరూ తమ ఆడపిల్లలకు ఈ వ్యాక్సిన్ అందించాలని, దీని ద్వారా గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడవచ్చని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పద్మావతి, PHN D.అమ్మాజీ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్