కాకినాడ కలెక్టరేట్లోని వికాస కార్యాలయంలో నవంబర్ 3న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు వికాస పీడీ కె. లచ్చారావు తెలిపారు. ఈ మేళాలో టెక్నీషియన్, మొబైల్ ఆపరేటర్, టెలీసేల్స్ రిఫ్రెజంటేటివ్, ప్యాకింగ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, టీం మేనేజరు వంటి వివిధ పోస్టులకు ముఖాముఖి నిర్వహించనున్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులైన 35 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులు. ఆసక్తిగలవారు నవంబర్ 3న ఉదయం 9 గంటలకు విద్యార్హత పత్రాలతో హాజరుకావాలని సూచించారు.