ఎన్నికల కమీషన్ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో నూతనంగా మరో 183 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదించామని జిల్లా రెవెన్యూ అధికారి జె. వెంకట్రావు తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా రెవెన్యూ అధికారి జె. వెంకట్రావు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రిజిష్టర్డ్ అన్ రికగ్నైజ్డు పార్టీల ప్రతినిధులు, నియోజకవర్గాల ఏఈఆర్ఓ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.