విశాఖపట్టణంలో 8 నుంచి ఆంధ్ర ప్రీమియం లీగ్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నట్లు ఇండియా క్రికెట్ టీం ప్లేయర్ కె. ఎస్. భరత్ పేర్కొన్నారు. మ్యాచ్‌ల తాలూకు ప్రమోషన్స్‌లో భాగంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ రంగారాయ మెడికల్ కాలేజ్ మైదానం లో ప్రాక్టీస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లీగ్ మ్యాచ్లు 8 నుంచి 23వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు.