ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని లయన్స్ ఫాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ టౌన్ హాల్లో లోకల్ బిజినెస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రెడ్ క్రాస్ సంస్థ రక్తదాతల నుండి రక్తాన్ని సేకరించింది. రక్తదాన శిబిరానికి లోకల్ బిజినెస్ నెట్వర్క్ అధ్యక్షులు తేజ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులు పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.