కాకినాడ: కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్తూ తండ్రి మృతి

పెదపూడి మండలం చింతపల్లి లాకు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గండ్రేడుకు చెందిన అజయ్‌కుమార్‌(30) మృతి చెందారు. అనారోగ్యంతో ఉన్న కుమారుడిని వైద్యం కోసం తీసుకెళ్తుండగా, వేగంగా వచ్చిన వ్యాన్‌ వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అజయ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అతని తల్లి విజయకుమారి, ఐదేళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు ప్రస్తుతం కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్