శుక్రవారం మధ్యాహ్నం కొత్త కాలువ వద్ద మంటలు చెలరేగాయి. కిలోమీటర్ల మేర దట్టమైన పొగ వ్యాపించడంతో గ్యాస్ లీక్ అయ్యిందంటూ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చివరకు అక్కడ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలకు నిప్పు అంటుకున్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో తరలివచ్చి మంటలను పూర్తిగా అదుపు చేశారు.