కాకినాడ: ఉల్లాసంగా సాగిన మెగా పేరెంట్స్ మీటింగ్

కాకినాడలోని పి.ఆర్. ప్రభుత్వ బాలుర పాఠశాలలో గురువారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. మామిడి తొరణాలు, రంగుల ముగ్గులతో పాఠశాలను అందంగా అలంకరించారు. 217 మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆటలు, ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. హెడ్‌మాస్టర్ స్టీవెన్ కింగ్ ప్రేమజ్యోతి విద్యార్థుల ప్రగతిపై వివరించారు. అనంతరం సహపంక్తి భోజనం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్