కాకినాడ రూరల్ వలసపాకల గ్రామంలో ఉన్న శ్రీ సాయిబాబా వారి గుడి వద్ద స్థానిక పెద్దల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నిర్వహించిన గురుపౌర్ణమి వేడుకలలో ప్రముఖ సీనియర్ సినీ నటులు సుమన్ తో కలిసి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ పాల్గొన్నారు. సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ గురు పౌర్ణమి కి ఈ ఆలయానికి రావడం జరుగుతుందన్నారు.