కూటమి ప్రభుత్వంలో అర్హులకు పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ రూరల్ పండూరు గ్రామంలో నూతన పెన్షన్లు ఆయన ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన, కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వితంతువులకు కొత్త పింఛన్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఒకటవ తేదీ ఉదయాన్నే లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు.