ప్రతి నెలా సామాజిక భద్రత కింద అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం కాకినాడలో నిర్వహించారు ఆగస్టు నెలకు సంబంధించి కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి జి. వీరపాండ్యన్. జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ కమిషనర్ భావన, ట్రైనీ కలెక్టర్ మానీషా లతో కలిసి పంపిణీ చేశారు. శుక్రవారం కాకినాడ 49వ వార్డులో నూతనంగా మంజూరైన స్పౌజు పింఛను కింద బొంతు అమ్మాజికి ఫించన్ల సొమ్ము అందజేశారు.