కాకినాడ రూరల్‌లోని సర్పవరంలోని శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయం శుక్రవారం భక్తులతో కిలకిలలాడింది. ఈవో సూర్యనారాయణ నేతృత్వంలో రాజ్యలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. వందలాది ముత్తయిదువులు హాజరై అమ్మవారికి కుంకుమ, గాజులు, పసుపు, పూలతో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ నెల 8న సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుపనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.