కాకినాడ నగర గైనకాలజికల్ సొసైటీ ఆధ్వర్యంలో కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో మూడు రోజుల పాటు నిర్వహించిన గైనకాలజీ వర్క్ షాప్ ఆదివారంతో ముగిసింది. ఈ సదస్సుకు సుమారు 1300 మంది వైద్యులు ఆంధ్ర, తెలంగాణలతో పాటుగా 25 మంది జాతీయ స్థాయిలో గైనకాలజిస్ట్లు హాజరయ్యారు. ఈ సదస్సులో నూతన ప్రసూతి వైద్య విధానంపై చర్చించారు. అలాగే వైద్య రంగంలో వస్తున్న ఆవిష్కరణలను చర్చించారు.