కరప: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం సీజ్

కరప ఎస్ఐ సునీత, కాకినాడ నుంచి ద్రాక్షారామం తరలిస్తున్న రెండు ఆటోలను తనిఖీ చేసి, 39 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 3,87,860గా నిర్ధారించారు. బియ్యం, ఆటోలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్