మైనర్ బాలుడితో గంజాయి దందా.. భారీగా నగదు సీజ్

కాకినాడలో బుధవారం పోలీసులు లోవరాజు అనే వ్యక్తిని, ఒక మైనర్ బాలుడిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 22 కేజీల గంజాయి, రూ.18.98 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్డీపీఓ మనీశ్ దేవరాజ్ తెలిపారు. నిందితుడిపై జిల్లాలో ఇప్పటికే పలు కేసులున్నాయని, మైనర్లను అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటున్నారని ఆయన వెల్లడించారు. ఈ దాడుల్లో సీఐలు నాగ దుర్గారావు, కృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్