కాకినాడలో జాతీయ స్థాయి జూనియర్ గర్ల్స్ హాకీ పోటీలు

కాకినాడలో ఆగస్టు 2 నుంచి 12 వరకు జాతీయ స్థాయి జూనియర్ గర్ల్స్ హాకీ పోటీలు జరగనున్నాయని కలెక్టర్ షమ్మోహన్ తెలిపారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి 800కు పైగా బాలికలు పాల్గొంటారని చెప్పారు. ఎంపికైన ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. పాల్గొనబోయే క్రీడాకారిణుల కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్