ఆదివారం సాయంత్రం ఉప్పాడ సముద్ర గ్రామాల్లో, హార్బర్ ప్రాంతాల్లో పర్యటించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని, కూటమి నాయకులు ప్రజలకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఉప్పాడ సముద్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.